ప్రారంభం...



శ్రీరంగనాథుని తో మొదలై, మరల ఆయనలోనే పర్యవసించే ఆచార్య రత్నహారన్లూ మన శ్రీవైష్ణవ కోటికి
రక్షా కవచం అయినటువంటిది "శ్రీమతే రామానుజాయనమః" అనే పదము. ఎందు వల్ల?
ఆచార్య రత్నహారానికి శ్రీమద్రామానుజులవారే నాయకమనిగా విలసిల్లుతున్నారు. ఎందు వల్ల?
ఇందరు ఆచార్యులు ఉన్నప్పటికీ, మనం మన సంప్రదాయ సిద్ధమైన నమస్కారానికి, శ్రీ రామానుజులవారి దివ్య నామాన్నే ఎందుకు ఉచ్చరిస్తున్నాం?
నేను విన్నంతలో, నేను నేర్చినంతలో, ఉడుతా భక్తిగా ఈ ప్రశ్నలకు ఇవ్వ సాహసించిన వివరణే ఈ బ్లాగు. నా సాహసానికి కారణం, ఎందఱో మహానుభావులు, సంప్రదాయజ్ఞులు, పెద్దలు, మా ఈ చిన్ని ప్రయత్నాన్ని గెలిపిస్తారని మా నమ్మకం.
అడియేన్ రామానుజ దాసన్!
